పర్లాకిమిడి: పట్టణంలో డోలా ట్యాంకు రోడ్డులో జరుగుతున్న డోలాయాత్ర వేడుకలు భుధవారంతో ముగిశాయి. గోవిందుడిని ఉయ్యాలలో వుంచి పాటలు పాడారు. ముగింపు వేడుకల్లో డోలాయాత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఽరాధావేషధారణ పోటీలను నిర్వహించారు. సాధారణ సభకు డోలాయాత్ర కమిటీ సభ్యులు గణేష్ పట్నాయక్, సరోజ్ పండా, సుభేందు మోహన్ సేనాపతి, బిబి మహంతి, సుబ్రాంశు శేఖర్ పట్నాయక్‌లు పాల్గొని డోలా ఉత్సవాలపై మాట్లాడారు. రాధా వేషాధారణ పోటీలకు న్యాయనిర్ణేతలుగా శుబ్రాంశు శేఖర్ పట్నాయక్, భరత్ భూషణ్‌మహంతి, మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ మాస్టార్ శుబేంధు మోహన్ సేనాపతి తదతరులు వ్యవహారించారు. మొత్తం 50 మంది చిన్నారులు రాధాగోపికల వేషాధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.


