సీపీఆర్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌పై అవగాహన

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

సీపీఆర్‌పై అవగాహన

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈగల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రీససిటేషన్‌)పై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌ సేఫ్టీ మెడికల్‌ ఆఫీసర్‌ జీజీ సాయికుమార్‌ మాట్లాడుతూ.. నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌ అందిస్తే మనిషి ప్రాణం కాపాడవచ్చన్నారు. అనతంరం సీపీఆర్‌ను ఎలా చేయాలో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ డీవీ రామమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement