కోరుకొండలో శాంతిచర్చలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి రఖల్‌గూఢ, యం.వి.26 గ్రామల మధ్య గిరిజన మహిళ విషయమై గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇరు గ్రామాల మధ్య శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అధ్యక్షతన శాంతి చర్చలు మంగళవారం జరిపారు. ఈ నెల ఐదో తేదీన జరిగిన గిరిజన మహిళ హత్య నేపథ్యంలో ఇరు గ్రామాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ గ్రామాల్లో పర్యటించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు గ్రామాల ప్రజలతో చర్చలు జరిపారు. పొట్టంగి, గుణుపూర్, చిత్రకొండ ఎమ్మెల్యేలు రామచంద్ర కడాం, సత్యజీత్ గోమెంగో, మంగుఖీలో, మినాక్షీ బాహినిపతి, నిమాయ్ సర్క్‌ర్, మనోజ్ నాయక్, జి.శ్రీనివాస్‌రావు, గోవిందపాత్రో, మున్న త్రిపాఠి, భోజాబాల్ మాఝి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోరుకొండలో శాంతిచర్చలు


