సెంచూరియన్ వర్సిటీలో రైతు దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో మంగళవారం భారత మాజీ ప్రధాని డాక్టర్ చౌదురీ చరణ్‌సింగ్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సాగర్ మైత్రా, అగ్రోనమీ ఉన్నత విభాగం అధిపతి తన్మయ శంకర్ రైతు దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రొఫెసర్లు సుప్రదీప్ సర్కార్, వై.నంజారెడ్డి, బి.చక్రపాణి పాల్గొన్నారు. సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాలలో ఆగ్రోనమీ, అగ్రో ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవంలో రైతులకు వర్మి కంపోస్టు, డ్రాగన్ ఫ్రూట్, సీవీడ్ ఎక్స్‌ట్రాక్టుపై అవగాహన కల్పించి వారికి సొరకాయ విత్తనాలను అందజేశారు. రైతులకు ఆరోగ్య పరీక్షలు చేశారు.
సెంచూరియన్ వర్సిటీలో రైతు దినోత్సవం


