రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల శిక్షణ భవనాలు ప్రారంభం
జయపురం: జయపురం సమితి ఫూల్‌బెడ గ్రామంలో 2.9 కోట్ల రూపాయలతో నిర్మించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల శిక్షణ భవన సముదాయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి సోమవారం ప్రారంభించారు. తొలుత వినాయక ప్రతిమకు పూజలు చేిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల శిక్షక్ష కేంద్రం ఏర్పాటుతో అవిభక్త కొరాపుట్‌లోగల రాయగడ, కొరాపుట్, నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాలకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లే కాకుండా కలహండి, నువాపడ జిల్లాల్లో నియమితులైన వారందరూ శిక్షణ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ కోసం మరో ప్రాంతానికి వెళ్లే సమస్య తీరిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆన్‌లైన్ సేవలతో పాటు మొబైల్ యాప్ ద్వారా భూములు కొనేందుకు, అమ్మేందుకు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్, జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం, మచ్చకొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, జిల్లా ఎస్పీ రోహిత వర్మ, ఐఏఎస్ అధికారి సంతోష్ కుమార్ పాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, రెవెన్యూ సూపర్‌వైజర్ హరిహర శతపది పాల్గొన్నార.


