సహస్ర కలశాభిషేకం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సోమవారం సహస్ర కలశాభిషేకం, శ్రీవారి గరుడవాహాన సేవ రాసూరు గ్రామం వరకు సాగింది. ఈ కార్యక్రమాలు సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, పద్మ దంపతులు ఆధ్వర్యంలో కొనసాగాయి. విద్యావేంకటేశ్వర స్వామి శహస్ర కలశాభిషేకం పూజలను శ్రీకూర్మం ఆచార్యులు సరిసఖ్యాత మహాచార్యులు, ప్రధాన ఆలయ పూజారి ఆరవెళ్లి శేఖరాచార్యులు, ఇతర పండితులతో ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం ప్రసాద సేవనం ఏర్పాటు చేశారు.
సహస్ర కలశాభిషేకం


