కృత్రిమ మేధపై అవగాహన
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో సోమవారం కృత్రిమ మేధ, ఏ.ఐ.క్యూ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్వోషియెంట్) సెమినార్‌ను వర్చువల్‌గా వర్సిటీ ఉపాధ్యక్షుడు డి.ఎన్.రావు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కంప్యూటర్ సైన్సు వైజ్ఞానికులు, నిపుణులు దృశ్యశ్రవణ విధానంలో నేటి తరం కృత్రిమ మేధ, చాట్ జి.పి.టి, జెమినీ వంటి సాంకేతిక సాధనాలు అవశ్యకతపై పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ మ్యానేజిమేంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.


