ఖుర్దా రోడ్‌లో సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025
భువనేశ్వర్: ఫిట్ ఇండియా చొరవలో భాగంగా, ఖుర్దా రోడ్‌లోని తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా) ఆదివారం సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025 నిర్వహించింది. మండల రైల్వే అధికారులు పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు, సాధారణ ప్రజలలో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ అవగాహన ప్రోత్సాహం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఖుర్దా రోడ్ రైల్వే మండలం సీనియర్ వాణిజ్య అధికారి, క్రీడాధికారి అనిల్ కుమార్, ఎస్ సమక్షంలో అదనపు మండల రైల్వే అధికారి సుభ్రో జ్యోతి మండల్ ఈ సైక్లోథాన్‌ను ప్రారంభించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన రవాణా విధానాల పట్ల రైల్వేల నిబద్దతకు ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్నారు.


