కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
రాయగడ: బీజేడీ పార్టీలో కీలకపాత్ర పొషించే స్థానిక రైతుల కాలనీకి చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక సమక్షంలో వారంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. బీజేడీకి రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఉన్న వారంతా ఇతర పార్టీలకు వలస పోతున్నారు. తాజాగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఇదే తరహా బీజేడీ (రాయగడ) పార్టీకి సేవలందిస్తున్న యువత కూడా ఆ పార్టీకి దూరమవుతుండటం చూస్తే జిల్లాలో ఆ పార్టీ ఉనికి కొల్పొతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. గత ఎన్నికల్లో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. తుబాటి రాము, వేణు, అరవింద్, మనోజ్, సంతోష్, మహేష్ తదితరులు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు.


