అదుపుతప్పిన మినీ బస్సులు
● 17 మంది ప్రయాణికులకు గాయాలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్రగిరి పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న రెండు మినీ బస్సులు కొండ దిగుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి పల్టీ కోట్టాయి. 17 మందికి గాయాలయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. గారబంద పోలీసు అధికారి ప్రఽషాంత్ కుమార్ నిషిక తెలియజేసిన వివరాల మేరకు.. ఖుర్దా, డెంకనాల్ నుంచి రెండు మినీ టూరిస్టు బస్సుల్లో మహేంద్రగిరి పర్వత్వానికి బయలుదేరారు. అక్కడ మందిరాలు దర్శించుకుని తిరిగి బుర్‌ఖాత్ పాస్ వస్తుండగా ఒక బస్సు బ్రేకులు ఫెయిలయ్యి అదుపుతప్పి రోడ్డు పక్క తిరగబడింది. వెనుక నుంచి వస్తున్న మరో టూరిస్టు బస్సు అదే స్థలం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న కోయిపూర్ వద్ద ప్రాథమిక చికిత్స చేశారు. సంఘటనా స్థలానికి గారబంద పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత కుమార్ నిషిక సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఖోజురిపద సీహెచ్‌సీ అంబులెన్స్‌లో పంపించారు. కేసును గారబంద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


