పురస్కారం అందజేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితికి చెందిన సుక్‌దేవ్, రుక్మిణి జంటకు శనివారం భూవనేశ్వర్‌లో కనక న్యూస్, సంబాద్ దినపత్రిక తరఫున పురస్కారం అందజేశారు. ఈ జంట 2003 నుంచి కలిమెల దళంలో చేరారు . వీరు ప్రేమించుకోని దళం వదిలి 2014లో వివాహం చేసుకున్నారు. సమితిలో ఉంటూ ఎందరో మావోలను జనజీవనంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత్తం సుక్‌దేవ్ కలిమెల ల్యాంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజాలకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ జంటకు కనక న్యూస్ మేకర్ 2025 కార్యక్రమంలో భాగంగా పురస్కారన్ని అందజేశారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైతుబజారు వద్ద ఉన్న చేపల మార్కెట్‌లో తూనికలు కొలతలు శాఖ ఇన్‌స్పెక్టర్ బలరామకృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలు ఉండటంతో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాటాలను కార్యాలయానికి తీసుకెళ్లి నిర్వాహకులకు జరిమానా విధించినట్లు చెప్పారు.


