ఘనంగా సరస్వతి శిశు విద్యామందిర్ వార్షికోత్సవం
పర్లాకిమిడి: సరస్వతి శిశు విద్యా మందిర్‌లో చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సుసంప్రదాయం ప్రతీక అని ఏడీఎం, ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగా అన్నారు.
ఒడిశాలో ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం, ఏ1 గ్రేడ్‌లు సాధిస్తున్న ఏకై క విద్యాలయం సరస్వతి శిశు విద్యామందిర్ అని అన్నారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ ముఖ్యఅతిథిగా విచ్చేసి సోండివీధి సమీపంలో ఉన్న సరస్వతి శిశు విద్యామందిర్ 36 వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వార్షికోత్సవానికి పోలీసు విభాగం మాజీ సూపరింటెండెంట్ సుభాష్‌చంద్ర జమాదార్, ఎత్తిపోతల శాఖ, అసిస్టెంటు ఇంజినీరు మనోజ్ కుమార్ చౌదరి, ఉపప్రధాన అచార్యులు సంతోష్ పాడి, విద్యాలయం కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వివిధ క్రీడా పోటీలలో విజయం సాధించినవారికి బహుమతులను ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఆచార్యులు సరోజ్ కుమార్ పండా ఆధ్వర్యంలో నిర్వహించారు.


