అయోధ్యకు సైకిల్ యాత్ర
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో టెంపరీ కాలనీకి చెందిన సునాధర్ ఖరా అనే వృద్ధుడు స్వగ్రామం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. ఇదివరకు ఈయన పూరీ శ్రీమందిరానికి ఇలాగే సైకిల్‌పై వెళ్లడం జరిగింది. ఆయనకు గ్రామస్తు లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ప్రయాణం దాదాపు 2 వేల కిలోమీటర్లు సాగుతుంది.
సీసీ కెమెరాలు ఏర్పాటు
పర్లాకిమిడి: పట్టణంలో ట్రాఫిక్, నేరాల నియంత్రణకు జిల్లా ఫారెస్టు జంక్షన్ నుంచి పాతకోర్టు జంక్షన్ వరకు 23 చోట్ల 60 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం రూ.28 లక్షలతో కెమారాలు ఏర్పాటు చేసి, నిర్వహణను పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్‌కు ఎస్పీ జ్యోతింద్ర పండా అప్పగించారు. నూతన సంవంత్సరం నుంచి వీటి పనితీరు ప్రారంభమవ్వనుందని తెలియజేశారు.
గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: జిల్లాలోని అడవ పోలీసులు 26 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలాఘాట్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక కారును తనిఖీ చేయడంతో గంజాయి బస్తా బయటపడింది. అందులో 26 కిలోల గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి మోహనా కోర్టుకు తరలించినట్లు ఐఐసీ సుబ్రాంత్ పండా తెలియజేశారు.
అయోధ్యకు సైకిల్ యాత్ర
అయోధ్యకు సైకిల్ యాత్ర


