● రోడ్డు నిర్మించాలని ఆందోళన
గజపతి జిల్లా గుసాని సమితి పాటికోట నుంచి చందనకోలా గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ స్థానికులు శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో పర్లాకిమిడి – ఆర్.ఉదయగిరి, మోహనా 326ఏ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కనీసం అంబులెన్స్ కూడా వెళ్లక అవస్థలు పడుతున్నామని వాపోయారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు వెళ్లి అందోళనకారులతో మాట్లాడారు. సమస్యపై మాట్లాడేందుకు 10 రోజుల గడువు కోరారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. – పర్లాకిమిడి


