కోత కోసిన వరిపంట దగ్ధం
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి నువగూడ పంచాయతీ ఆర్‌ఎస్‌సీ 11 గ్రామంలో కోతకోసిన వంటపంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నలుగురు రైతులు కోత కోసిన పంటను నూర్పు చేసేందుకు ఒక దగ్గర ఉంచారు. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. దీంతో సుబా తామరబువ, మంగళా మల్లిక్, బలరాంహంతాల్, నారాయణ్ ఖిల్‌కు భారీ నష్టం వచ్చింది. విషయం తెలుసుకున్న చిత్రకొండ అగ్నిమాపక బృందం వచ్చి మంటలను అదుపు చేశారు. అలానే రెవెన్యూ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు. త్వరలో నష్ట పరిహారం అందజేస్తామన్నారు.
కోత కోసిన వరిపంట దగ్ధం


