పాఠశాలలో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి పొలమ పంచాయతీ పొడబట్టి గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాఠశాల తలుపులను విరగ్గొట్టి అందులోకి చొరబడ్డాయి. విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని చెల్లాచెదురు చేశాయి. పాఠశాలలోని టేబుల్స్, బెంచీలను విరగ్గొట్టి వీరంగాన్ని సృష్టించాయి. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మూడు ఏనుగులు పాఠశాలలో చొరబడి సామగ్రి ధ్వంసం చేసినట్లు పాఠశాల హెచ్‌ఎం హలధర్ కౌసల్యకు సమాచారం అందించారు. విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా ఈ సమితి పరిధిలోని పర్శాలి, పొలమ, బుడాగుడ తదితర ప్రాంతాల్లోని ఏనుగులు హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు.
పాఠశాలలో ఏనుగుల బీభత్సం


