డోర్ డెలివరీ సేవలు వినియోగించుకోవాలి
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కాంప్లెక్స్‌లోని పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 84 పట్టణాలకు డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం–1వ డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్‌కుమార్, స్టేషన్ మేనేజర్ మీసాల ప్రసాదరావు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, పార్సిల్ కౌంటర్ సూపర్‌వైజర్ రాజేష్, కౌంటర్ సిబ్బంది పాల్గొన్నారు.


