పరిసరాల శుభ్రత పాటించాలి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికులు తినుబండారాలు, వాటర్‌బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో మాత్రమే వేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్‌కుమార్, ఎ.గంగరాజు, ఎస్‌ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎం.హాటకేశ్వరరావు, టీఐ–3 ఆచారి, గోవిందరాజులు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు.


