మత్తుతో జీవితం చిత్తు
ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు
అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్‌ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్‌కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు.
ఇంధన పొదుపుతోనే భవిష్యత్
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆవరణలో శనివారం ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పల్స్ పోలియో తప్పనిసరి
గార: ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు కచ్చితంగా వేయాలని గార పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా అన్నారు. ఆదివారం జరగనున్న పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి శనివారం గారలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
22న నెట్‌బాల్ ఎంపికలు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. వివరాలకు 8500007272 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘ముస్తాబు’
గార: విద్యాశాఖలో నూతనంగా ముస్తాబు కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీధర్ శాలిహుండం కేజీబీవీలో శనివారం ప్రారంభించారు. విద్యార్థినులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిసారించాలన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ఆర్.సత్యన్నారాయణ, మండల ఇంజినీర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షులు చౌదరి అవినాష్ హాజరై ముస్తాబు కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మీ, ప్రధానాచార్యులు పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.
మత్తుతో జీవితం చిత్తు
మత్తుతో జీవితం చిత్తు


