గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : బడివానిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 18, 19 తేదీల్లో అల్లినగరం ఉన్నత పాఠశాల వేదిక జరిగిన నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ పోటీల్లో స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నారని పాఠశాల పీడీ ఆనంద్ శనివారం తెలిపారు. సూరాడ లక్షణ్ 100 మీటర్లు పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, 400 రిలేలో బంగారు పతకాలు సాధించి వ్యక్తిగత చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నాడని చెప్పారు. మైలపల్లి పోలీసు త్రిపుల్ జంప్‌లో బంగారు, కాంస్య పతకాలు, ఉప్పాడ ఆది 1500 మీటర్ల పరుగు, త్రిపుల్ జంప్‌లో రజత పతకాలు, బాలికల విభాగంలో సీహెచ్ చంద్రకళ బంగారు పతకం, రెండు వెండి పతకాలు, ఉప్పాడ స్వప్న రెండు వెండి పతకాలు, మూగి చందు బంగారు, కాంస్య పతకాలు సాధించినట్లు వివరించారు. వీరిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
బ్యాడ్మింటన్ పోటీల్లో..
జి.సిగడాం: నియోజకవర్గ స్థాయిలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలిచారు. వీరిని సర్పంచ్ పున్నాన సోనియా, ఎంపీటీసీ మక్క శ్రీలత, హెచ్‌ఎం ఎస్.భానుమూర్తి, వి.రవికుమార్, బి.వెంకటేష్ శనివారం అభినందించారు.
కొచ్చెర్ల విద్యార్థులకు అభినందనలు
రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయిలో అల్లినగరంలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో కొచ్చెర్ల హైస్కూల్ విద్యార్థుర్ధులు సత్తా చాటారు. సీనియర్ గర్‌ల్స్ కోకో, టెన్నికాయిట్, ప్రథమ స్థానంలో నిలవగా జూనియర్ గర్‌ల్స్ విభాగంలో టెన్నికాయిట్ ద్వితీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్ 100 మీటర్లు, 400 మీటర్లు షాట్ పుట్‌లో ప్రథమ స్థానం సాథించారు. వీరిని హెచ్‌ఎం తిరుపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.
గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


