ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి ల్యాంప్స్ పరిధిలోని తార్లాకోటా పంచాయతీలో ధాన్యం మండీ ద్వారా కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్‌ను రైతులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సంవత్సరం తార్లకోటా మండీలో 1500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 400 మందికి పైగా రైతులు ధాన్యం విక్రయానికి నమోదు చేసుకున్నారన్నారు. ల్యాంప్స్ నిర్ణయించిన ధర రూ.1,500 అమ్మితే.. మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని కోల్పోయో పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అదే విధంగా వారానికి కేవలం ఒకరోజు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. దీనిని రెండు రోజులకు పెంచాలని రైతులు కోరారు. 1,500 క్వింటాళ్లకు బదులుగా 2,500 క్వింటాళ్ల వరకు కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని పంచాయతీ పరిధిలోని రైతులందరూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదాన్ ద్వారా జిల్లా కలెక్టర్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ ల్యాంప్స్ అధ్యక్షుడు సాలు ఖీలో, తార్లకోటా సర్ప్‌ంచ్ పద్మనాభ మాడ్కమి, మాజీ సర్పంచ్ సోమనాథ్ బార్సే, గోవింద గోలారీ పాల్గొన్నారు.


