చేతబడి నెపంతో వ్యక్తి హత్య
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఉస్కాపల్లి గ్రామంలో గురువారం చేతబడి నెపంతో ముక్క పోడియామి (51) అనే వ్యక్తిని హత్య చేశారు. ఇంటిలో నిద్రపోతున్న ముక్కపై గురువారం తెల్లవారుజామున ఇద్దరు కత్తితో దాడి చేశారు. ముక్క గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతోనే ఇలా చేశారు. ముక్క కుటుంబ సభ్యులు పొట్టేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించగా ఇద్దరిపై అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆడమా పోడియామి, ఇర్మా పోడియామిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చేతబడి నెపంతో వ్యక్తి హత్య


