జనావాసాల మధ్య జైల్ తరలించాలి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సదర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో దీర్ఘకాలంగా నివసిస్తున్న 200 కుటుంబాలు ఆందోళనకు గురువారం దిగారు. జైల్ సమీపంలో ఉండకూడదంటూ బస్తీను ఖాళీ చేయాలని పోలీసు శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జనం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్‌ను కలిసి ముఖ్యమంత్రి పేరున రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలంటూ ఏడాదిన్నర కాలం రనిరాహర దీక్షలు చేయడంతో 2023లో పట్టాలు మంజూరు చేశారు. ఆ తరువతా బస్తీ వాసులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కూడా పేర్లు చేర్చి ఇళ్ల నిర్మాణం చేయాలని కొద్దిగా నిధులు మంజూరు చేశారు. దీంతో సంతోషంతో ఇళ్లను నిర్మిస్తున్న సమయంలో ఇక్కడ ఎవరూ ఉండకూడదని.. ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బస్తీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న జైలునే వేరే చోటకి తరలించాలి తప్పితే తాము వెళ్లేదిలేదని తెంగించి చెప్పారు. బస్తీ వాసులకు మద్దతుగా మల్కన్‌గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్, డీసీసీ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు కలెక్టరేట్‌కు చేరారు.


