గిరిజనులకు రగ్గులు పంపిణీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి బోండాఘాటీలో ముదిలిపోప పంచాయతీలో రోటరీక్లబ్ తరఫున గిరిజనులకు గురువారం రగ్గులు పంపిణీ చేశారు. కొండలపై నివసిస్తున్న బోండా తెగ గిరిజనులు చలితీవ్రతతో ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ 13 డిగ్రీలకంటే ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రోటరీక్లబ్ ప్రతినిధులు రగ్గులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. రానున్న రోజుల్లో కూడా గిరిజనులకు సహాయ సహకారాలు అందజేస్తామని రోటరీ సభ్యులు లోభోసాహు తెలిపారు.


