1,098 లీటర్ల సారా స్వాధీనం
పర్లాకిమిడి: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అబ్కారీ, పోలీసు శాఖలు ఉమ్మడిగా సరిహద్దుల్లో ఉన్న గుసాని సమితి గారబంద, గొప్పిలి పోలీసు ష్టేషన్ల మధ్య దుర్గం, బలేం, సింగిపురం, కుయ్యురో గ్రామాల్లో బుధవారం ఆకస్మికంగా దాడులు చేపట్టాయి. 14,950 ఎఫ్.ఎం.వాష్, 1098 లీటర్ల వంట సారాను పట్టుకున్నారు. వీటిని అక్రమంగా తయారుచేస్తున్న వారిని అరెస్టు చేసి పర్లాకిమిడి ఎకై ్సజ్‌శాఖకు తరలించి వారిపై ఏడు కేసులను రిజిస్టర్ చేసినట్టు గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తెలియజేశారు. ఈ దాడుల్లో పర్లాకిమిడి సదర్ ఎకై ్సజ్‌శాఖ అధికారి ప్రసన్న కుమార్ పటేల్, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎకై ్సజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
1,098 లీటర్ల సారా స్వాధీనం


