‘సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి’
రాయగడ: పాత్రికేయ రంగంలో యువత ఆసక్తి కనబరచాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్‌లో బుధవారం స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 5 వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సమస్యలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహొరొ మాట్లాడుతూ పత్రిక రంగంలొ పాటించాల్సిన నియమనిబంధనలకు అనుగుణంగా పాత్రికేయులు తమ విధులు నిర్వహించి సమాజాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సుభాష్ చంద్ర సూర్య వార్షిక నివేదికను చదివి వినిపించారు. అధ్యక్షులు శివనారాయణ గౌడొ అసొసియేషన్ తీరు తెన్నుల గురించి వివరించారు. అసోసియేషన్‌లో చేరిన కొత్త సభ్యులకు ఆయన ఆహ్వానించి వారికి గుర్తింపు కార్డులను అందించారు. అసోసియేషన్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక అధ్యక్షుడు కీర్తి చంద్ర సాహు తదితరులు ప్రసంగించారు.


