ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) ప్రారంభమయ్యాయి. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎంసీ కార్యాలయం ఎదుట రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి నిత్యానంద గొండో ప్రారంభ పూజలు చేసి కేంద్రం ప్రారంభించారు. ఈ ఏడాది రైతులకు క్వింటాల్‌కి రూ..2,389 తో పాటు ప్రోత్సాహకంగా మరో రూ.731 కలిపి ఇస్తామన్నారు. జిల్లాలో 58 మండీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 50,919 మంది రైతుల నుంచి 14 లక్షల 88 వేలు క్వింటాళ్ల వరి ధాన్యం సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష బీజేడీకి చెందిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి మండీలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


