
బీచ్ ఫెస్టివల్‌కు సన్నద్ధం
సోంపేట: బారువలో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బారువ బీచ్‌ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు హాజరవుతారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా బీచ్ క్లీనింగ్ జరుగుతుందన్నారు. క్రీడాపోటీలు, వీలైతే బోటింగ్ పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ, పర్యాటక, అగ్నిమాపక, రహదారులు భవనాలు, అటవీశాఖ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.