గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ నాహక్‌ హత్య | - | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ నాహక్‌ హత్య

Sep 30 2023 6:18 AM | Updated on Sep 30 2023 8:22 AM

- - Sakshi

ఒడిశా: గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ నాహక్‌ గురువారం రాత్రి కుదలాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఏఎస్పీ రమేష్‌ చంద్ర సెఠి తెలిపిన వివరాల మేరకు.. అస్కా పోలీసుస్టేషన్‌ పరిధి బొడగాం గ్రామానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ నాహక్‌ను కుదలా పోలీసుస్టేషన్‌ పరిధి ధర్మగడ గ్రామంలో దుండగులు మారణాయుధాలతో హత్యచేసి పరారయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎంకేసీజీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. హత్యకు గురైన సునీల్‌ నాహక్‌ కొద్ది నెలల క్రితం అస్కాలో హనుమాన్‌ కోయన్‌కి సంబంధించి డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఆయనపై వివిధ పోలీసుస్టేషన్లలో పదుల సంఖ్యలో గంజాయి కేసులు, పలు నేరారోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నిందితులను గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement