వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని వైద్యులు, వైద్య సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు అన్నారు. ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో జరిగిన సమావేశంలో డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో 100 శాతం ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించాలని తెలిపారు. ప్రతి మండల పరిధిలోని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను, బీసీ హాస్టళ్లను, నెలకు రెండుసార్లు తప్పనిసరిగా సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భానూనాయక్‌, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement