కూచిపూడి(మొవ్వ): మొవ్వ మండలంలోని ప్రముఖ నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠాన్ని ఇస్రో విశ్రాంత డైరెక్టర్ పద్మ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి శుక్రవారం సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ప్రసాద్ తొలిసారిగా కూచిపూడిని సందర్శించి, విద్యార్థుల నాట్యాన్ని తిలకించానని ఈ అనుభూతి తీపి గుర్తుగా ఉంటుందని తన ఆనందాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ ఆనాటి కళాకారుల విశేషాలను వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథశాస్త్రి, గ్రంథాలయ పాలకులు వైవీ ఫణి కుమార్ పాల్గొన్నారు.


