విజయవాడలీగల్: తాను లాయర్‌నని పలువురిని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే విజయవాడ రూరల్ రామవరప్పాడుకు చెందిన పోలుకొండ వెంకటేశ్వరరావు విద్యుత్ శాఖలో జేఈ. ఆయనకు.. భార్యతో మనస్పర్థల కారణంగా సంధ్యారాణి 2024లో గుడివాడ పోలీసుస్టేషన్‌లో 498ఎ కేసు పెట్టారు. దీనిపై విజయవాడ కోర్టు వద్ద కప్పారెడ్డి ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్ అనే వ్యక్తి తను లాయర్‌నని వెంకటేశ్వరరావుతో పరిచయం చేసుకున్నారు. గత 25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ, అనేక కేసులను పరిష్కరించానని నమ్మబలికాడు. ఇతనితోపాటు మరో ఇద్దరు లాయర్లమని చెప్పి గుడివాడ పోలీసుస్టేషన్‌లో ఆ కేసు విషయమై 41ఏ నోటీసు యిప్పించారు. కేసు పరిష్కారం నిమిత్తం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి వెంకటేశ్వరరావు వద్ద పలు దఫాలుగా రూ.13 లక్షలు, వ్యక్తిగత అవసరాలకంటూ మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.19 లక్షలు వసూలుచేశాడు. సెల్‌ఫోన్ కూడా గిఫ్టుగా తీసుకొని కేసును మాత్రం పరిష్కరించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకటేశ్వరరావు బెజవాడ బార్ అసోసియేషన్‌ను సంప్రదించి కప్పారెడ్డి ప్రవీణ్‌కుమార్ అస లు లాయర్ కాదని తెలుసుకుని సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు. ఈ విషయమై బీబీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఇటువంటి నకిలీ లాయర్‌ను నమ్మి ఎవరైనా మోసపోతే బీబీఏ నుగానీ, పోలీసులనుగానీ సంప్రదించాలని సూచించారు. ప్రవీణ్‌కుమార్‌పై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది.


