పటమట(విజయవాడతూర్పు): రైల్వే ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్ సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకం చేసింది. రైల్వే ఉద్యోగులకు సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలు, శాలరీ ఖాతాలు, రుణ సదుపాయాలు, ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య. విజయవాడ రీజినల్ హెడ్ ఇ.వెంకటేశ్వరరావు, గుంటూరు రీజినల్ హెడ్ జి.వి.రమణారావు సమక్షంలో అవగాహన ఒప్పంద కార్యక్రమం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ తరఫున ఏడీఆర్‌ఎం (ఏడీఆర్‌ఎం)పాల్ ఎనోక్ ఎడ్విన్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ లకావత్ (ఐఆర్‌పీ) పాల్గొన్నారు.


