పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే విజయవాడ డివిజన్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ వర్షా సోనాకియా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణనాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా ఆమె ప్రత్యామ్నాయ దిశగా స్వయంగా వెదురుతో కుండలను తయారు చేశారు. ఆ వెదురు కుండీల్లో మొక్కలు నాటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement