వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యం

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య సిబ్బందికి సమయ పాలన ఉండాలని, వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యమని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు పేర్కొన్నారు. పాత ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోని సమావేశపు హాలులో విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలోని ఏఎన్‌ఎంలతో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ.. గర్భిణుల్లో ప్రమాద సంకేతా లను ముందుగానే గుర్తించి, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల బరువు, రక్తపోటు, హిమోగ్లోబిన్‌ తదితర అంశాలను సరైన విధానంలో పరీక్షించడం, రికార్డుల్లో ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయడంపై సిబ్బందికి అవగాహన కలిగించారు. బర్త్‌ ప్లాన్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవడం, ప్రమాదం ఉన్న గర్భిణులను గుర్తించి సరైన సమయంలో ఆస్పత్రికి రిఫర్‌ చేయడం, రిఫరల్‌ సేవల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, డీపీహెచ్‌ఎన్‌ఓ రేణుక, వైద్య సిబ్బంది సుహాసిని, వరలక్ష్మి, అపరంజి, లీలాశ్రీ పాల్గొన్నారు.

యూపీహెచ్‌సీ సేవల పరిశీలన

విజయవాడ నగరంలోని కండ్రిక, ప్రకాష్‌నగర్‌ యూపీహెచ్‌సీల్లో అందుతున్న సేవలను మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు పరిశీలించారు. వైద్యాధికారి, సిబ్బంది ముఖ ఆధారిత హాజరు, డ్రెస్‌ కోడ్‌, గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఫార్మసీలో స్టాక్‌ రిజిస్టర్లు, అత్యవసర మందులు లభ్యత, ఓపీ వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ అమూల్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement