3న టెట్‌ సమస్యలపై చలో విజయవాడ | - | Sakshi
Sakshi News home page

3న టెట్‌ సమస్యలపై చలో విజయవాడ

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

3న టెట్‌ సమస్యలపై చలో విజయవాడ కానూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పింఛను బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్‌ మూడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.పి. మనోహర్‌కుమార్‌ ప్రకటించారు. ప్రభుత్వం విడు దల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో యూటీఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2015లో విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23(1)కు వివరణ ఇస్తూ చట్టంలో చేర్చిన అంశాల కారణంగా ఉపాధ్యాయ నియామకాలకే గాక, సర్వీసులో కొనసాగాలన్నా, ప్రమోషన్‌ పొందాలన్నా టెట్‌ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగ విరమణ చేసేవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్‌ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు కొన్ని హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ టెట్‌ నిర్వహించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుంద రయ్య మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌లో అర్హత మార్కులు తగ్గించాలన్నారు. అనంతరం డీఈఓ, కలెక్టర్‌ కార్యాలయాల్లో ఆయా అధికారులకు నేతలు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.లీల, జిల్లా కార్యదర్శి షేక్‌ ప్రైమర్‌ సాహెబ్‌, బి.రెడ్‌స్టార్‌, ఎం. లలితశ్రీ, నాయకులు ఎ. అనంత కుమార్‌, అబ్దుల్‌ హబీ, ఎ.భరత్‌, ఎం.లింగారెడ్డి, జి.విజయలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు: మండలంలోని కానూరులో గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు మంగ ళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు.. కానూరు బల్లెంవారివీధిలో రైతుబజార్‌ వద్ద గుర్తు తెలియని వక్తి మృతి చెందాడు. అతని వయస్సు 45 సంవత్సరాలు ఉంటుంది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు 99517 46017 నబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలపాలని ఎస్‌ఐ రమేష్‌ కోరారు.

చిలకలపూడి(మచిలీపట్నం): పింఛన్‌ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యయుతంగా అమలు చేయా లని ఏపీ సీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ ఉద్యోగులందరికీ పాత పింఛన్‌ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. కలెక్టరేట్‌లో సీపీఎస్‌ ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్‌ ఒకటో తేదీన చలో విజయవాడ కార్యక్రమంపై ముద్రించిన వాల్‌పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు సీపీఎస్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు సీపీఎస్‌ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో సీపీఎస్‌ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. తక్షణమే పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సీఎం దాస్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ ఒకటో తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్‌నాథ్‌, ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.నాంచారయ్య, ఏపీఆర్‌ఎస్‌ఏ సీనియర్‌ నాయకుడు నెల్సన్‌పాల్‌బాబు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు శోభన్‌బాబు, కిరణ్‌కుమార్‌, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement