పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం విని పించే నేత మాధవరావును మండలి డెప్యూటీ చైర్మన్‌గా నియమించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరులోని శంకరరావు స్వగహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాధవరావును ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంక రరావు, అన్నాబత్తున శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్, చీరాల, అద్దంకి, ఒంగోలు, పెనమలూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల సమన్వకర్తలు కరణం వెంకటేష్, చింతలపూడి అశోక్‌కుమార్, చుండూరు రవికుమార్, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.


