బీఎస్సీ నర్సింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

బీఎస్సీ నర్సింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తే కఠిన చర్యలు

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

బీఎస్సీ నర్సింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తే కఠిన చర్యలు

నాణ్యమైన క్లినికల్‌ శిక్షణ తప్పనిసరి నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌లో వీసీ డాక్టర్‌ పులాల చంద్రశేఖర్‌ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్‌ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలను తీవ్రంగా పరిగణించిన హెల్త్‌ యూనివర్సిటీ నర్సింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్స్‌తో వీసీ డాక్టర్‌ పులాల చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని వారు వివరించారు. నర్సింగ్‌ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ సూచించిన పాఠ్య ప్రణాళికను సమర్థంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన క్లినికల్‌ శిక్షణను తప్పనిసరిగా అందించాలని ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, వృత్తి బాధ్యత పెంపొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లన్నారు.

మాల్‌ప్రాక్టీస్‌ జరగకూడదు

పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చూడాలని ప్రిన్సిపాల్స్‌ను వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌ ఆదేశించారు. రానున్న రోజుల్లో పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌ జరిగినా సంబంధిత విద్యార్థులతో పాటు ఆయా కళాశాలల పైనా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను పరీక్షల నుంచి డీబార్‌ చేయడంతో పాటు, సంబంధిత నర్సింగ్‌ కళాశాలలపై జరిమానాలు విధించే చర్యలు కూడా చేపడతామని వారు స్పష్టం చేశారు. నాణ్యమైన నర్సింగ్‌ విద్య, పారదర్శక పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల పెంపుదలే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement