ప్రయోగాలతో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయోగాలతో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

శాసీ్త్రయ దృక్పథానికి సరైన ప్రోత్సాహం అందిస్తాం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ 100 పాఠశాలలకు సైన్స్‌ జెనీ బాక్స్‌ కిట్ల పంపిణీ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాల ద్వారా ఆయా అంశాలపై నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్‌ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్‌) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్‌, ఎస్‌సీఈఆర్‌టీ, జెనీ సైన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో 100 పాఠశాలలకు సైన్స్‌ జెనీ బాక్స్‌ కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నగరంలోని సీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్‌ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక రసాయన జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తితో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ట్‌ సహకారంతో సైన్స్‌ కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్‌ సూచించారు. జెని బాక్స్‌ కిట్ల ద్వారా 40 రకాల ప్రయోగాలు చేసేందుకు వీలవుతుందని ఆప్కాస్ట్‌ సభ్య కార్యదర్శి డాక్టర్‌ కె.శరత్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 2026 పోస్టర్లను ఆవిష్కరించారు. 10 నుంచి 17 ఏళ్ల వయసు గల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి, డీఈవో ఎల్‌.చంద్రకళ, సమగ్రశిక్ష ఏపీసీ ఆర్‌.రమేష్‌ బాబు, జెనీసైన్స్‌ వ్యవస్థాపకుడు ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement