గన్నవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవడం ద్వారా సమాజానికి సేవ చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ రామ్‌జీ కూన పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నాల్గవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌జీ చేతుల మీదుగా పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించాలని కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, వైస్ చైర్మన్ లంక అరుణ్ పిలుపునిచ్చారు. తమ కళాశాల విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకేఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షతన పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


