న్యాయం కోరి వస్తే.. వారిపైనే కేసులా? | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోరి వస్తే.. వారిపైనే కేసులా?

Jul 23 2026 2:06 AM | Updated on Jul 23 2026 2:06 AM

కృష్ణాజిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ ఘాటు లేఖ

కృష్ణాజిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ ఘాటు లేఖ

లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీసుల వ్యవహారశైలిని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ కృష్ణాజిల్లా ఎస్పీకి ఘాటు లేఖ రాశారు. జిల్లాలో అమలవుతున్న పోలీసు రాజ్యాంగం కూటమి ప్రభుత్వ పాలనను స్పష్టం చేస్తోందని అందులో పేర్కొన్నారు. మహానీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డపై ఎందరో ఎస్పీలు గొప్పగా విధులు నిర్వహించారని, కానీ ప్రస్తుత ఎస్పీ పనితీరుతో నిజాయితీ గల పోలీసులు, అధికారులు సైతం మనస్సాక్షిగా పనిచేయలేక పోతున్నామని అంతర్మఽథనం చెందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వంటిపై ఖాకీ యూనిఫాం వేసుకుని న్యాయం చేస్తున్నామా అనే దిగులుతో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.

ఫిర్యాదులు చేసేందుకు వెళితే...

నాపై ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టి రాజకీయ గందరగోళం, ప్రజల్లో అశాంతి, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని అనిల్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళితే న్యాయం చేయక పోగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వారిపైనే కేసులు పెట్టడం పోలీసు రాజ్యాంగమా అని ఆ లేఖలో ప్రశ్నించారు. కేసులు నాకేమీ కొత్తకాదని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా భరిస్తానని, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం కానీ, ఇక్కడ ఎస్పీగా మీరు తెరవెనుక ఉండి నడిపించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాలు పోలీసు వ్యవస్థలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణా జిలాల్లో ఎస్పీ జమానాలో రాజ్యాంగం అమలు శూన్యమని పేర్కొన్నారు. మేము రాజకీయాల్లోనే ఉన్నామని, చట్టాన్ని చదువుకున్నామని, చట్టాన్ని ఉల్లఘించడం, దౌర్జన్యాలకు దిగడం, తప్పుడు కేసులు పెట్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాలను రెచ్చగొట్టడం మేము ఏ రోజూ చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఒక్కటే కోరుతున్నామని, పామర్రు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, అసలు వాస్తవం ఏంటీ, పోలీస్‌స్టేషన్‌లలో ఏమి చేస్తున్నారు, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పోలీసు విధులు నిర్వర్తిస్తున్నారా, ఎమ్మెల్యే చెప్పినట్లు ఆడుతున్నారా అనే విషయాలను మనస్సాక్షిగా పరిశీలించాలని కై లే అనిల్‌కుమార్‌ ఆ లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement