న్యూస్‌రీల్
జాగ్రత్తలు తప్పనిసరి
బిళ్లపాడుకు ఐఎస్‌ఓ గుర్తింపు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
● తిరువూరుకు చెందిన
13 ఏళ్ల బాలికకు సోకిన వైనం
● 15 పడకలతో ప్రత్యేక వార్డు,
మూడు విభాగాల్లో పరీక్షలు
● ఆందోళన చెందుతున్న
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.480 టీఎంసీలు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఐదేళ్ల కిందట ప్రజలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడి మృతి చెందారని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. తాజాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ఆగిరిపల్లికి చెందిన వృద్ధురాలికి మంగళగిరి ఎయిమ్స్‌లో రెండు రోజుల కిందట కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. చాపకింద నీరులా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ గతంలో లాంటి పరిస్థితులను తలచుకుంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం కోవిడ్‌ను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక రెండు వారాల కిందట కిడ్నీ సమ స్యతో ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు రెండు రోజులుగా జ్వరం రావడంలో అనుమానం వచ్చిన వైద్యులు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటు, పక్కన బెడ్స్‌పై ఉన్న రోగులకు సైతం వైద్యులు ఆర్టీపీ సీఆర్ పరీక్షలు చేయించారు. అయితే వారందరికీ నెగటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ బాలికకు కోవిడ్ ఎలా సోకిందనేది నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఎవరికై నా సిబ్బందికి కోవిడ్ సోకి వారి ద్వారా వచ్చిందా? బంధువుల ద్వారా వచ్చిందా అనేది నిర్ధారణకాలేదు. అంతే కోవిడ్ సోకినట్లు గుర్తించని వారి ద్వారా ఆమెకు సోకినట్లు నిర్ధారణకు వచ్చారు.
కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు ఇప్పటి వరకూ నిర్వహించ లేదు. కేవలం జలుబు, జ్వరం, బాడీపెయిన్స్ వంటి వాటితో ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, పల్మోనాలజీ విభాగాలకు వచ్చే వారికి మాత్రం కోవిడ్ లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. రాపిడ్ కిట్‌లను కూడా సిద్ధం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో 15 పడకలుతో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతో పాటు, ఆరు పడకలతో ఐసీయూను ఏర్పాటు చేసి, పల్మోనాలజీ హెచ్‌ఓడీని నోడల్ అధికారిగా నియమించారు. ఇప్పటి వరకూ దాదాపు 50 మందికి పైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, బాలికకు మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు వైద్యాఽధికారులు చెబుతున్నారు.
జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డు
కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. కోవిడ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వారు మరింత అప్ర మత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
గుడివాడరూరల్: మండలంలోని బిళ్లపాడు పంచాయతీకి ఐఎస్‌ఓ 9001:2015 గుర్తింపు లభించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ ఈ అవార్డు అందుకున్నారు.


