నీరువెల్లా విషం | - | Sakshi
Sakshi News home page

నీరువెల్లా విషం

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

కలుషిత నీరే కారణమా?

డయేరియా కట్టడికి చర్యలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ గిరి పురంలో డయేరియా అదుపులోకి రాలేదు. శని వారం మరొక మహిళ వ్యాధిబారిన పడ్డారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన చోటే కొత్తగా కేసు నమోదైంది. ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియా సోకిన వారిలో ఒక్కొక్కరుగా కోలుకుని ఇంటికి చేరుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారా అని ఆరా తీస్తోంది. కుళాయిల నుంచి ఇంకా రంగుమారిన నీరే వస్తోంది. దీంతో ఆ వాటిని తాగవద్దని అధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా నగరపాలక సంస్థ అధికారులు ఇంటింటికీ ఆర్వో వాటర్‌ పంపిణీ చేస్తున్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

వారం రోజులుగా డయేరియా

గిరిపురం ప్రాంతంలో వారం రోజులుగా ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో డీ హైడ్రేషన్‌కు గురవడంతో కిడ్నీ సమస్యలు సైతం తలెత్తాయి. శుక్రవారం నాటికి 20 మంది వరకూ డయేరియా బారిన పడగా, శనివారం ఒక మహిళకు ఈ వ్యాధి సోకిందని వైద్య సిబ్బంది గుర్తించారు. గిరిపురం ప్రాంతంలో ప్రతి ఇంటికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు పంపిణీ చేస్తున్నారు.

వైద్య శిబిరంలో పది మందికి చికిత్స

గిరిపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో స్వల్ప అస్వస్థతతో వచ్చిన పది మందికి వైద్యం అందించారు. ఒక మహిళ డయేరియాతో బాధప డుతూ శిబిరానికి రాగా ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివిధ శాఖల సమన్వయంతో పరిస్థితిని అదుపు చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు డ్రెయిన్లు శుభ్రం చేస్తూ, యాంటీ లార్వా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

డయేరియా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారులు శుక్రవారం గిరిపురం ప్రాంతానికి వచ్చి కుళాయిల ద్వారా సరఫరా అవు తున్న నీటి శాంపిళ్లు సేకరించారు. వాటి రిపో ర్టులు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది కుళాయిల నుంచి వచ్చే నీటినే తాగుతుంటారు. తాగునీటి పైపులైన్లు ఎక్కువగా డ్రెయిన్ల నుంచి ఉండటంతో, తాగునీరు కలుషితమై విషపూరితంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కుళాయి నీటిని తాగొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వీఎంసీ ఆర్వో వాటర్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తోంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు డెట్టాల్‌, సబ్బులు ఇంటింటికీ అందజేస్తున్నారు.

గిరిపురంలో డయేరియాను కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి. శనివారం ఒక డయేరియా కేసు వచ్చింది. వాటర్‌ శాంపిల్స్‌ ఫలితాలు ఇంకా రాలేదు. ప్రత్యేక వైద్య శిబిరం ఆదివారం కూడా కొనసాగుతుంది. ఆ తరువాత పరిస్థితిని బట్టి కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తాం. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి డయేరియా బాధితులెవరైనా ఉన్నారా అని ఆరా తీసుకున్నారు. వైద్యశాఖ పరంగా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం.

– డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు, డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌ జిల్లా

గిరిపురంలో అదుపులోకి రాని డయేరియా

శనివారం మరొకరికి అతిసార

చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి తరలింపు

కుళాయిల నుంచి రంగు

నీరే వస్తున్న పరిస్థితి

ఆ నీటిని తాగొద్దని తేల్చిచెబుతున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement