హిట్లర్‌లా నియంతృత్వ పోకడలు తగదు | - | Sakshi
Sakshi News home page

హిట్లర్‌లా నియంతృత్వ పోకడలు తగదు

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

హిట్లర్‌లా నియంతృత్వ పోకడలు తగదు తాపీమేస్త్రి బలవన్మరణం

సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫలాల్యలను ప్రశ్నించిన ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం వంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. గన్నవరం కోర్టులో రావణ్‌ కస్టడీ పిటీషన్‌పై వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్‌ను కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచారణ దశలో ఉన్న కస్టడీ పిటీషన్‌లో బలం లేదని ఉపసంహరించుకోవడం తన న్యాయవాద వృత్తిలో తొలిసారి చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ వ్యక్తిని సంతృప్తి పరిచేందుకు రావణ్‌పై రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. ఇది న్యాయ సమ్మతం కాదనే ఉద్దేశంతో రావణ్‌కు మద్దతుగా వాదించేందుకు ముందుకువచ్చినట్లు చెప్పారు. నిజంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా రావణ్‌ వ్యాఖ్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్‌ఐఏ వంటి కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల భద్రత కోసమే ఈ అక్రమ కేసులు పెట్టినట్లుగా ఉందన్నారు. హిట్లర్‌ మాదిరిగానే కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందన్నారు. ఇదే పంథా కొనసాగితే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ ఉండదన్నారు. ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించిన, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన రావణ్‌కు పట్టిన గతే పడుతుందని కూటమి పాలకులు సాంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికై న ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలని కోరారు. హిడ్మా మృతిపై చేసిన వ్యాఖ్యలకు రావణ్‌ను ఉరితీసేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే ఉపా కేసులను యూట్యూబర్‌ రావణ్‌పై నమోదు చేయడమంటే ఇంత కంటే దుర్మార్గం రాష్ట్రంలో మరోకటి ఉండదని మరో సీనియర్‌ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గతంలో కూడా భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందన్నారు. న్యాయవాదులు తిరివీధి వెంకయ్య, టి. కట్రావు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఓ తాపీ మేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక గౌతమీనగర్‌ రెండో లైన్‌లో గొర్రెల బంగార్రాజు (48) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. అతని భార్య ఇళ్లల్లో పనిచేస్తోంది. కుమార్తెలిద్దరు చదువుకుంటున్నారు. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. 11 గంటల వర కు కుటుంబ సభ్యులు సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. అతను మాత్రం పక్క బెడ్‌రూంలో పడుకుంటానని చెప్పి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచినా అతను మాత్రం లేవలేదు. తలుపు తట్టినా ఉలుకూపలుకూ లేదు. గోడకు ఉన్న రంధ్రంలో గుండా లోపలికి చూడగా ఫ్యాన్‌ హుక్‌కు చున్నీతో ఉరేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement