పీజీఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

వివిధ సమస్యలపై అర్జీలు 237

సాక్షి, విజయవాడ: కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసి ప్రజలు తమ సమ స్యలను అర్జీల రూపంలో అందించారు. వివిధ శాఖలకు సంబంధించి 237 అర్జీలు అందాయి. అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 70, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 62 అర్జీలు నమోదయ్యాయి. శాఖల వారీగా పోలీసు 26, పంచాయతీరాజ్‌ 22, జల వనరులు 13, విద్యుత్‌ 9, వైద్య, ఆరోగ్యం ఆరు, పౌర సరఫరాల శాఖ పరిధిలో నాలుగు అర్జీలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలని అధికా రులను కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియా, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జ్యోతి పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి..

భవన నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులకు విజయవాడ నగరంలో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులందరికీ గతంలో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశకు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కొత్త కార్డులు ఇచ్చేందుకు, ఉన్న కార్డు రెన్యువల్‌ చేసుకోవడానికి వెళ్తే లేబర్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లు నిండిన కార్మికులకు, మరణించిన కార్మికుడి భార్యకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు పింఛన్‌ అందేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement