గన్నవరం: యూ ట్యూబర్ ప్రశ్న రావణ్‌పై గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రశ్న చానల్ సీఈఓ గమన, ఆ చానల్‌కు ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చిన ఇంద్రసేననాయుడుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో వారిద్దరిని ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇటీవల మాదాపూర్‌లోని స్డూడియోలో స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలను గమన, ఇంద్రసేననాయుడు సమక్షంలోనే సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది. విచారణలో గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్ పాల్గొన్నారు.


