మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఆదివారం కొనసాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి 165 మందికి సీట్లను కేటాయించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు చెప్పారు. సోమవారం కూడా ఐటీఐ కౌన్సెలింగ్ జరుగుతోంది.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం కలిసి ధైర్యం చెప్పారు. విజయవాడలోని మొగల్రాజపురంలో వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. గెల్లి కిశోర్‌కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. వియాత్నాంలో కిశోర్‌కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు సమాచారం ఇచ్చారని మంత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు.


