స్వగ్రామానికి ప్రసన్నలక్ష్మి భౌతికకాయం | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి ప్రసన్నలక్ష్మి భౌతికకాయం

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

ఇబ్రహీంపట్నం: అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 5వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) భౌతికకాయం ఆదివారం ఉదయం స్వగ్రాయానికి చేరుకుంది. ఆరురోజుల అనంతరం ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న భౌతిక కాయాన్ని, అంబులెన్స్‌లో ఆదివారం ఉదయం మూలపాడుకు తీసుకొచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. న్యూజెర్సీలో ఉంటున్న ప్రసన్నలక్ష్మి జాబ్‌ కాల్‌లెటర్‌కు పూజ చేయించుకునేందుకు కారులో స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో న్యూయార్క్‌ నగరంలో మరో కారు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రైతు కుటుంబం నుంచి అమెరికా వరకు వెళ్లి చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందిన వెంటనే ప్రసన్నలక్ష్మి మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement