జగద్గురువులకు స్వరనీరాజనం
విజయవాడకల్చరల్: శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రం, శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో శంకర జయంతి సందర్భంగా భారతీ తీర్థ శ్రవణ సదనంలో శంకర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆదిశంకరులకు ప్రత్యేక పూజలను ధర్మాధికారి హనుమత్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగీతోత్సవంలో సంగీత విద్వాంసులు గాయత్రి గౌరీనాథ్, పోపూరి గౌరీనాథ్ బృందం జగద్గురువులు రచించిన స్తోత్రాలను మధురంగా గానం చేశారు. కళాకారులు పలు సంప్రదాయ కీర్తనలను మధురంగా గానం చేశారు. బెంగళూరుకు చెందిన సురవరపు విద్య, ఉమ నిర్వహించిన గాత్ర కచేరీ ఆకట్టుకుంది.
ఽదర్మ పరిరక్షకులు ఆదిశంకరులు
హిందూ ధర్మపరిరక్షకులు జగద్గురు ఆదిశంకరులని ఆధ్యాత్మికవేత్త అడవికోలను భార్గవ శ్రీరామమూర్తి అన్నారు. శంకర జయంతి సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కలియుగంలో ధర్మానికి మార్గదర్శకత్వం చేసిన మహనీయుడు ఆదిశంకరులని, ఆయన బోధనలు సర్వదా ఆచరణీయమన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి నాలుగు మూలల నాలుగు పీఠాలను స్థాపించారన్నారు.
జగద్గురువులకు స్వరనీరాజనం


