విజయవాడ: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతుండటంపై వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ.. పవిత్రతను కాపాడటం లేదా ఈవో గారు అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు. ‘కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి.వైదిక కమిటీ ఏం చేస్తుంది?, ఆలయంలో సెక్యూరిటీ ఏం చేస్తుంది? తనిఖీలు గాలికి వదిలేశారా? అని నిలదీశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు పోతిన మహేష్.
పోతిన మహేష్ లేవెనెత్తిన అంశాలు..
1. అమ్మవారి ఆలయంలో కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేయడం అమ్మవారికి చీకటిలోనే నైవేద్యం సమర్పించే దుస్థితికి చేరుకోవడం
2. అన్న ప్రసాదంలో పనిచేసే వర్కర్లకు రోజువారి వేతనం అన్నదాన సర్వీస్ కాంట్రాక్టర్ తక్కువగా చెల్లిస్తున్నారని ఆలయంలోనే ఆందోళన చేసిన సంఘటన
3. విశిష్ట పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగులు
4. అమ్మవారి గర్భగుడికి అతి చేరువలోనే కేక్ కటింగ్ కార్యక్రమం
5. ఒక అమ్మవారి ఆలయంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాల లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు మిగిలిన దేవాలయాల్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అధికారుల అవినీతి వలన అని స్పష్టంగా చెప్పగలం
6. అమ్మవారి ఆలయం లో కమిషనర్ గారు కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినా EO గారు కాంట్రాక్టర్ లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు స్టాండింగ్ కౌన్సిల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ కోర్ట్ వారికి నిజాలు తెలియజేయరా?
7. తిరుమలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిసారి ఏదో ఒక అపశ్రుతి అపచారం జరుగుతూనే ఉంది మద్యం మాంసాహారం చెప్పులు వేసుకుని ప్రధాన ఆలయ ద్వారా వరకు వెళ్లడం తొక్కిసలాట ఘటనలు మరణాలు సంభవించడం అనేకం
ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆలయ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మరీ రాజీనామా చేశారు అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యం తిరుమలలో అధికారుల అవినీతి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో హిందూ భక్తులు అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి:
విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం


